నవతెలంగాణ-బెజ్జంకి
కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పోరేట్ వ్యక్తులకు కొమ్ముకాసే బడ్జెట్ అని, సామాన్యులను విస్మరించి సంపన్నులను సుసంపనులను చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతరామన్ బడ్జెట్ రుపోందించింది. గతంలో వామపక్షాల అద్వర్యంలో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే తక్కువ నిధులు కేటాయించడం నిర్వీర్యం చేయడంలో భాగమే. పేద మద్య తరగతి ప్రజలను కించపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బోనగిరి రూపేశ్, సీపీఐ మండల కార్యదర్శి మండిపడ్డారు.