38 కేజీలు గంజాయి స్వాధీనం…

– నలుగురు నిందితులు అరెస్ట్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.రావాణా దారుల నుండి 38 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.స్థానిక ఆబ్కారీ సీఐ నాగయ్య తెలిపిన వివరాలు లా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేపల్లి కి చెందిన ముంతోజు స్వరూప,దారా బాబు,కోదారి నిర్మల,ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు కు చెందిన చామకూరి మాధవి లు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం గంజాయి కొనుగోలు చేసి కాకినాడ నుండి సిరిసిల్ల వెళుతున్న ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తున్నారు.ఖమ్మం లో దిగి అక్కడ రైలు ద్వారా హైద్రాబాద్ చేరుకుని విక్రయ దారులకు అప్పగించాలని నిందితులు ముందుగా ప్రణాళిక వేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర,జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ నెల (జనవరి) 22 నుండి 31 వరకు చేపట్టిన ప్రత్యేక నిరంతర తనిఖీల్లో భాగంగా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సీఐ నాగయ్య పర్యవేక్షణలోఅశ్వారావుపేట,సత్తుపల్లి ప్రత్యేక బృందాలు మంగళవారం తనిఖీ చేస్తున్నాయి.ఈ క్రమంలో  ఆర్టీసీ బస్సును నిలుపుదల చేస్తుండగా గమనించిన నిందితులు బస్సు దిగి పారిపోబోయారు. అప్రమత్తమైన ఎక్సైజ్ బృందాలు వెంబడించి పట్టుకున్నాయి.వారి లగేజీ బ్యాగుల్లో సోదాలు చేయగా లగేజీ బ్యాగుల్లో 38 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్ల లభించాయి.నిందితులను అదుపులోకి తీసుకుని ఆబ్కారీ స్టేషన్ తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీ.ఐ నాగయ్య తెలిపారు.ఈ సోదాల్లో ఎక్సైజ్ ఎస్సైలు శ్రీహరిరావు వెంకటేష్,సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love