19న సుందరయ్య వర్ధంతి సందర్భంగా 38వ స్మారకోపన్యాసం

– ముఖ్య అతిథి లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ నెల 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా 38వ స్మారకోపన్యాసాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6గంటలకు నిర్వహించనున్నట్టు ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినరుకుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌వీకే ట్రస్ట్‌ చైర్మెన్‌ బీవీ రాఘవులు అధ్యక్షతన ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-సవాళ్లు, రాజ్యాగ విలువలు’ అంశంపై లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి స్మారకోపన్యాసం చేస్తారని పేర్కొన్నారు.

Spread the love