గుజరాత్‌లో 4.1 తీవ్రతతో భూకంపం

కచ్‌ (గుజరాత్‌): గుజరాత్‌లో కచ్‌ జిల్లాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 8.06 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు : 24.27, పొడవు : 70.21, 15 కిలోమీటర్ల లోతులో కచ్‌ జిల్లాలో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love