నవతెలంగాణ – సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాలో రూ. 3.10 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డిలో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ జాతీయ రహదారి పై టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలను తనీఖీలు చేశారు. తనిఖీలు చేస్తుండగా.. బ్యాగ్ లో ఉన్న బంగారం బయటపడింది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ తో ఉన్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పట్టుబడ్డ బంగారం విలువ 5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.