కొత్తగా 4 ఎంఎంటీఎస్‌ రైళ్లు..

నవతెలంగాణ- హైదరాబాద్ : హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సబర్బన్‌కు సంబంధించిన ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు సర్వీసులను మేడ్చల్‌ – లింగంపల్లి, మేడ్చల్‌ – హైదరాబాద్‌ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను ఈ నెల 1 నుంచే అందుబాటులోకి తీసుకువస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నిర్ణయం తీసుకున్నారు.  సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి నడుస్తున్న మూడు వందేభారత్‌ రైళ్లకు వీలుగా ఉండే విధంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నూతన టైమ్‌టేబుల్‌ విడుదల చేశారు. అందుకోసం సికింద్రాబాద్‌ – ఉమ్‌దానగర్‌, ఫలక్‌నుమా – సికింద్రాబాద్‌ స్టేషన్ల మధ్య కూడా ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడుపుతున్నామన్నారు.

Spread the love