రైలు ఢీకొీని 40 మేకలు మృత్యువాత

రైలు ఢీకొీని 40 మేకలు మృత్యువాతనవతెలంగాణ-ధరూర్‌
రైలు ఢీకొీని 40 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితులు కిష్టిబారు, పుల్‌సింగ్‌ నాయక్‌, చంద్రిబారు, బాలరాజు, రమేశ్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం రోజు వారిగా 70 మేకలతో మేపడానికి వెళ్లారు. ఇంటి వచ్చినప్పుడు అడవి పంది రావడంతో భయంతో మేకలు పరుగులు తీశాయి. అదే సమయంలో సాయంత్రం 6 గంటల సమయంలో రైలు రావడంతో వాటిని ఢకొీన్నాయి. దీంతో సుమారు 40 మేకలు మృత్యువాత పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

Spread the love