– కలుషిత ఆహారమే కారణమా ?
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలోని సిగల్ కాలనీలో ఉన్న కస్తూర్భా బాలికల గురుకుల పాఠశాలలో 40 మంది బాలికలు అస్వస్థతకు గురికావడంతో గురు వారం ఉదయం వారిని హుటా హుటిన మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిం చారు. పాఠశాల ఎస్‌ఓ భవాని తెలిపిన కథనం ప్రకారం.. బుధవారం రాత్రి బాలికలు టమాటా కూరతో భోజనం చేయడంతో రాత్రి నుంచి కొంత మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలైనట్టు తెలి పారు. విద్యార్థులు అస్వస్థతకు గురికాగా విషయం గోప్యంగా ఉంచి వైద్య అధికారులను పిలిపించి పాఠశాలలోనే చికిత్స అందించారు. ఉదయం మరికొంతమంది విద్యా ర్థులు కూడా అస్వస్థతకు గురికావడంతో భయాం దోళనలకు గురైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల అస్వస్థత విష యాన్ని ఉన్నతాధి కారులకు వివరిం చారు. వారి ఆదే శాల మేరకు బాలి కలను ఉదయం హుటా హుటిన 108 అంబులెన్స్‌తో పాటు కార్లలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పాఠశాల భోజనం తయా రీలో కలుషితమైన నీటిని వాడారా? టమాటా కర్రీలో ఏమైనా పడిందా? అనే విషయం తెలియడం లేదు. ఈ ఘటనలో మొత్తం 40 మంది బాలికలు అస్వస్థ తకు గురైనట్టు తెలు స్తోంది. అధికారులు పాఠశాల లోని తాగునీరు, భోజనం సీజ్ చేసి ఫోరెన్సిక్‌కు పంపించినట్టు సమా చారం. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థినీలను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, మున్సి పల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి పరామర్శిం చి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కాగా, బాలికలు అస్వస్థతకు గురైన విష యాన్ని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమా చారం ఇవ్వకపోవడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.