400 మట్టి వినాయకుల పంపిణి ..

నవతెలంగాణ -వీర్నపల్లి
వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయకులను ఎ ఎం సి చైర్మన్ గుజ్జులా రాజిరెడ్డి, స్ధానిక సర్పంచ్ పాటి దినకర్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎ ఎం సి చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు బదులుగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ 400 మట్టి వినాయకులను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం,ఎంపిటిసి అరుణ్ కుమార్, బి అర్ ఎస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు, ఉప సర్పంచ్ రాములు, డైరెక్టర్ రాజు, మండల సీనియర్ నాయకులు భగవంతం, శ్రీరామ్ నాయక్,నాయకులు పృధ్వీ, రాజం , అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love