కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం..

నవతెలంగాణ – కువైట్‌: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది భారతీయులు ఉండటం గమనార్హం. వారు కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. దక్షిణ మంగాఫ్‌ జిల్లాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం.

 

Spread the love