– నేడు జిల్లా లో సాధించిన విద్యుత్ ప్రగతి సమావేశం
నవతెలంగాణ – సిద్దిపేట
రాష్ట్రావిర్భావం నుండి సిద్దిపేట జిల్లా పరిధిలో 4104.08 కోట్ల రూపాయల వ్యయం తో విద్యుత్ సరఫరా అభివృద్ధి జరిగింది. గృహ అవసరాలు, వ్యవసాయ అవసరాలకు, పారిశ్రామిక రంగానికి నిరంతరం విద్యుత్ సరఫరాను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు, నియోజకవర్గానికి నిధులను కేటాయించి జిల్లా అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి కృషి చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా -జూన్ 5 రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు … ఏర్పడిన నాటి నుండి విద్యుత్ సరఫరా లో సాధించిన ప్రగతి పై సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
సిద్దిపేట నియోజకవర్గంలో సాధించిన విద్యుత్ ప్రగతి…
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అన్ని రంగాలలో ఆదర్శంగా నిలపడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం మంత్రి విద్యుత్తు రంగ అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తూ, విద్యుత్ సరఫరా లో ప్రగతిని సాధించారు. 53,367 వ్యవసాయ విద్యుత్ కనేక్షన్ ల కోసం రూ 266.83 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
నియోజకవర్గంలో వినియోగదారుల సంఖ్య పెంపు..
గృహ వినియోగదారులు 159900 నుండి 334171 పెరిగాయి, కమర్షియల్ వినియోగదారులు 14896 నుండి 41152 కి, వ్యవసాయ వినియోగదారులు 108103 నుండి 161470కి, పారిశ్రామిక వినియోగదారులు 2197 నుండి 3733కి, హెచ్ టి వినియోగదారులు 169 నుండి 486కి, ఇతర కేటగిరీల వినియోగదారులు 3954 నుండి 10415 కి పెరిగారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు 264233 మంది వినియోగదారులు ఉంటే ప్రస్తుతం నేడు 551427 మంది వినియోగదారులు ఉన్నారు. ఇలా ఏ రంగంలో చూసుకున్న రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి జరిగింది.
నియోజక వర్గ విద్యుత్ సరఫరా వ్యవస్థ….
రాష్ట్రం ఏర్పడక ముందుకు నియోజకవర్గంలో
400 కేవీ సబ్ స్టేషన్లు 1 ఉంటే నేడు 3 , 220 కేవీ సబ్ స్టేషన్లు 1 ఉంటే నేడు 3, 132 కేవీ సబ్ స్టేషన్లు 10 ఉంటే నేడు 14, ఈ హెచ్ టి పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ లు 36 ఉంటే నేడు 121కి పెరిగాయి. రూ 2576 కోట్ల వ్యయంతో ఈ సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నేటి సదస్సును విజయవంతం చేద్దాం…
– మహేష్ , ఎస్ ఇ , విద్యుత్ శాఖ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏర్పడిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన విద్యుత్ సరఫరా అభివృద్ధిపై సమావేశం జరుగుతుంది.
మంత్రి హరీష్ రావు సహకారం తోనే జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి జరిగింది. ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారులు, విద్యుత్ వినియోదారులు పాల్గొని విజయవంతం చేయాలి.