ప్రభుత్వ విప్ జన్మదిన సందర్భంగా క్రికెట్ కిట్ల పంపిణీ

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన సందర్భంగా మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ఎంపీటీసీ గజెల్లి మీనా దుర్గ బాబు నేత,  గంప గోవర్ధన్ తనయుడు రాష్ట్ర బిఆర్ఎస్ యువ నాయకులు గంప శశాంక్ చేతుల మీదుగా  సిద్ద రామేశ్వర నగర్, ర్యాగట్లపల్లి, గుర్జకుంట యూత్ క్లబ్ లకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, సిద్ధ రామేశ్వర నగర్ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, గుర్జకుంట సర్పంచ్ కందడి మనోహర రమేష్ రెడ్డి, ర్యాగట్లపల్లి సర్పంచ్ నాగన్నగారి అనసూయ, ఉప సర్పంచ్ లతా సుధాకర్, మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రంజిత్ వర్మ, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్, నాయకులు బోనాల శ్రీనివాస్, పుట్నాల శ్రీనివాస్, వార్డు సభ్యులు భూమలింగం, గుడాల అరుణ్, రాజంపేట ఎల్లేష్, భారతి, యూత్ అధ్యక్షులు దండు నవీన్, క్రికెట్ యూత్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love