– యూనివర్సల్ గ్రూప్ స్కూల్ చైర్మన్ పార్వతి, రాజారాం
నవతెలంగాణ-డిచ్ పల్లి
జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఖిల్లా డిచ్ పల్లి రామాలయం, దాని పక్కనే గల లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని యూనివర్సల్ గ్రూప్ స్కూల్ చైర్మన్ పార్వతి, ఆమె భర్త రాజారాం హాలిడే చెప్పారు ఆదివారం రాత్రి డిచ్ పల్లి లోని రామాలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన చేయడానికి 30% గ్రామస్తులు కాంట్రిబ్యూటర్ ఇస్తే 65% కేంద్రం నుంచి మంజూరయ్యే విధంగా చూస్తామని చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన పూజారి రవికుమార్ వారిచే ప్రత్యేక పూజలు చేయించారు వారి వెంట ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సర్పంచ్ రాదా కృష్ణ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.