ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..నిలిచిన 45 బస్సులు

నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ లో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి తీవ్ర కలకలం రేపింది. దీంతో 45 ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. డ్రైవర్ పై దాడి ఘటనకు నిరసనగా బస్సులను డ్రైవర్లు నిలిపివేశారు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములుపై నవాజ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నవాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ప్రైవేటు బస్సు డ్రైవర్లు ప్రకటించారు. నిందితుడు నవాజ్‌పై పోలీసు స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. వికారాబాద్, తాండూర్ – హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love