నవతెలంగాణ – న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు చుట్టుముడుతుంది. ఈ పరిస్థితుల్లో దృశ్యమానత బాగా తగ్గింది. దట్టమైన పొగమంచు కారణంగా.. ఢిల్లీలో 45 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు శనివారం తెలిపారు. కాగా, ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌లో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 నుండి 1.30 గంట వరకు 50 మీటర్ల కనిష్ట దృశ్యమానత నమోదైంది. ఆ తర్వాత కొంచెం మెరుగుదల కనిపించింది. ఉదయం 7.30 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా ఉంది. మరోవైపు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బహుశా ఈరోజు గరిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈరోజు ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంపడే అవకాశం ఉందనిభారత వాతావరణ శాఖ తెలిపింది.