నవతెలంగాణ – హైదరాబాద్: న్యూయార్క్‌లో గత ఐదు రోజులుగా ఒక్క చోట కూడా కాల్పులు చోటుచేసుకోలేదని సిటీ పోలీసులు తెలిపారు. ఇలా 5 రోజులపాటు కాల్పులు జరగకపోవడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని వెల్లడించారు. అలాగే 2024 డిసెంబర్‌లో తుపాకీ కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తెలిపారు. అదే 2023 డిసెంబర్‌లో 9 మంది తూటాలకు బలైనట్లు పేర్కొన్నారు. కాగా కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్‌లో నిత్యం ఏదోకచోట కాల్పులు జరగడం పరిపాటిగా మారింది.