ఎల్‌ఐసీ బీమా సఖిలో 50వేల మంది నమోదు

న్యూఢిల్లీ: జీవిత బీమా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ ఇటీవల మహిళలకు ఏజెంట్లుగా అవకాశం కల్పించడానికి ప్రారంభించిన బీమా సఖికి విశేష స్పందన లభిస్తోంది. నెల రోజుల్లోనే ఇందులో 50,000 పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని ఆ సంస్థ వెల్లడించింది. ఈ పథకంలో రిజిస్ట్రర్‌ అయినటువంటి 52,511 మందిలో 27,695 మంది బీమా సఖిలకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు వెల్లడించింది. ఇప్పటికే 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలు పెట్టారని తెలిపింది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపింది.

Spread the love