రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు

– ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో
నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని అర్హులైన వారందరూ  సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని చల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్యాస్ లబ్ధిదారులతో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి  ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల లో ఒకటి అయినా రూ.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలులో భాగంగా చల్వాయి గ్రామ ప్రజలు 2080 మంది అర్జి చెయగ అదులొ 488 మంది తప్పుగ నమోదు చేసినదున వారి మాత్రమే మలీ గ్యాస్ నెంబర్ నమోదు చేసుకోగలరు అని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదనగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అభినందిస్తూ అలాగే గ్రామ ప్రజలు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ను గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియపరచి మీయొక్క గ్యాస్ నెంబర్ ని నమోదు చేసుకోవాలని సూచించారు.  ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భారతి కాంగ్రెస్ నాయకులు జెట్టి సోమయ్య కేంద హరి ప్రసాద్ చిక్కుల వెంకటేష్ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Spread the love