నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 500 మందికి పునరావాసం కల్పించారు. బాధితులకు గురువారం ఉదయం నుండి టిఫిన్ భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. మండల కేంద్రంలో సుమారు మూడు వార్డులలో 250 కుటుంబాలు ముంపుకు గురైనట్లు ఆర్ఐ సుధాకర్ కార్యదర్శి శంకర్ లు తెలుపుతున్నారు. స్థానిక పంచాయతీ సర్పంచ్ లావుడియా లక్ష్మి జోగ పునరావస బాధితులకు దగ్గరుండి సౌకర్యాలు కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయికుమార్, ఎంపీటీసీలు ఆలూరు శ్రీనివాసరావు, గోపి దాసు ఏడుకొండలు, ఉప సర్పంచ్ అల్లంనేనీ హనుమంతరావు వార్డు సభ్యులు పెండింగ్ శ్రీకాంత్ బాధితులకు ధైర్యం చెబుతూ వారికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు.