చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు నుంచి ప్రభుత్వాస్పత్రులకు 500 యూనిట్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు నుంచి 500 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. అవసరంలో ఉండి రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే ఆశయంతో మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పిలుపునందుకుని అభిమానులు నిత్యం రక్తదానం చేస్తూనే ఉన్నారు. అలా అభిమానుల నుంచి సేకరించిన 500 యూనిట్లలో పేద రోగుల కోసం హైదరాబాద్‌ లోని ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రి వంద యూనిట్ల చొప్పున, అదే విధంగా వరంగల్‌ లో రోగులకు, మహబూబ్‌ నగర్‌ లో చికిత్స పొందుతున్న వారికి వంద యూనిట్ల చొప్పున పంపించారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్‌ సెంటర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాధవి, అభిమానులను, రక్తదాతలను ప్రశంసించారు. రక్తదానం ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ఆమె తెలిపారు.

Spread the love