మధ్యాహ్నం 3 గంటలకు 51.89 శాతం నమోదు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌కు మరో రెండు గంటలకే సమయం ఉండటంతో సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో పోలింగ్‌ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు  ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 69.33 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది.

Spread the love