పెండింగ్ లో ఉన్న 5177 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి

 – ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్
నవతెలంగాణ -కంటేశ్వర్ : పెండింగ్ లో ఉన్న 5177 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ఫీజు దీక్ష నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని నిజామాబాద్ నగర 10వ వార్డ్ కమిటీ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5177 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్  స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయని, వీటి వలన విద్యాభ్యాసం పూర్తి అయ్యి పై చదువుల రీత్యా లేదా ఉద్యోగాల రిత్యా వెళ్లాలనుకునే వారికి స్కాలర్షిప్ రాని కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు వారికి సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెంచి ఇవ్వాలని, పెండింగ్ స్కాలర్షిప్ కు సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చే రకంగా ప్రభుత్వం కృషి చెయ్యాలని మరియు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజు విద్యార్థుల దగ్గరుండి తీసుకోకుండా ప్రభుత్వమే చెల్లించాలని, ఈ ప్రధాన డిమాండ్లతో ఈనెల 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో ఫీజు దీక్ష నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని అన్నారు. కాబట్టి విద్యార్థులందరూ పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని లేనియెడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు హెచ్ గణేష్ , హెచ్ వేణు మరియు 10వ డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రాహుల్ నాయకులు శ్రీకాంత్ , రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love