హింసాయుత ఘటన.. 52 మంది మృతి

నవతెలంగాణ- హైదరాబాద్: ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా.. 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. అయితే హింసాయుత ఘటనలకు గల కారణాలుపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని తెలుస్తోంది.
Spread the love