సోనాలికా ట్రాక్టర్‌ అమ్మకాల్లో 5.2 శాతం వృద్థి

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌కు చెందిన సోనాలికా బ్రాండ్‌ గడిచిన మేలో దేశీయంగా 5.2 శాతం వృద్థితో 11,130 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 10,577 యూనిట్ల అమ్మకాలు చేసింది. పరిశ్రమ వృద్థిని అధిగమించి అమ్మకాలను నమోదు చేసినట్లు ఆ కంపెనీ ఎండీ రమన్‌ మిట్టల్‌ తెలిపారు. రైతులు సరైన ధరలకు సోనాలికా హెవీ డ్యూటీ ట్రాక్టర్‌లను కొనుగోలు చేసేలా తాజాగా ‘జూన్‌ జాక్‌పాట్‌’ ఆఫర్‌ను కూడా ప్రారంభించామన్నారు.

Spread the love