నవతెలంగాణ – ముంబై: ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరానికి గాను తమ వ్యాపార, ఆర్థిక విజయాలను ప్రకటించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ₹457 కోట్లతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో న్యూ బిజినెస్ ప్రీమియం 53% పెరిగి ₹699 కోట్లకు చేరింది. పలు కీలక కొలమానాల పరంగా కంపెనీ గణనీయమైన పురోగతిని సాధించింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ₹1,758 కోట్లకు చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ₹1,433 కోట్లతో పోలిస్తే చెప్పుకోతగ్గ స్థాయిలో 23% పెరిగింది. అంతేకాకుండా ప్రస్తుత పాలసీదారులను అట్టిపెట్టుకోగలిగే సామర్థ్యాలను సూచిస్తూ రెన్యువల్ ప్రీమియం 8% వృద్ధి చెంది ₹1,059 కోట్లకు చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది ₹977 కోట్లుగా నమోదైంది. అలాగే, నిధులు గణనీయంగా వృద్ధి చెందడాన్ని సూచిస్తూ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) ఏకంగా 18% పెరిగి ₹7,075 కోట్లకు చేరింది. 2023 మార్చి నాటికి ప్రధాన ఈక్విటీ యులిప్ ఫండ్ అయిన ఫ్యూచర్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు మార్నింగ్‌స్టార్ నుంచి 5 స్టార్ రేటింగ్ ఉంది. అలాగే, 2022 సంవత్సరానికి గాను మనీకంట్రోల్ రూపొందించిన టాప్-పెర్ఫార్మింగ్ మిడ్‌క్యాప్ యులిప్ ఫండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. అటు ఫ్యూచర్ ఎపెక్స్ ఫండ్‌కు కూడా మార్నింగ్‌స్టార్ 4 స్టార్స్ రేటింగ్ ఇచ్చింది. అమల్లో ఉన్న పాలసీలకు సంబంధించి మొత్తం సమ్ అష్యూర్డ్ (రైడర్‌లతో సహా) 13% పెరిగి ₹1,36,806 కోట్లకు చేరడం ద్వారా పాలసీల మొత్తం విలువ గణనీయంగా పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది ₹1,21,477 కోట్లు.
కంపెనీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, “ఫ్యుచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2023 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలు మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి. కస్టమర్ ఆధారిత పరిష్కార మార్గాలు, అసాధారణ స్థాయిలో సేవలు అందించడం ద్వారా కొత్త కస్టమర్లను దక్కించుకోవడంలోనూ మరియు ఉన్న వారు కొనసాగేలా చూడటంలోనూ మా సిబ్బంది ఎంతో నిబద్ధతతో పని చేసి, కీలక పాత్ర పోషించారు. కస్టమర్ ప్రధానంగా సేవలు అందించడానికి మేము ప్రాధాన్యతనిస్తాము. అనుకోని ఘటనలు మా కస్టమర్లకు ఎదురుకాకుండా నివారించేందుకు, వారిని రక్షించేందుకు వివేకవంతమైన ఆర్థిక ప్రణాళికల ద్వారా మేము నిరంతరం కృషి చేస్తున్నాము. సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకుంటూ నిరంతరాయమైన పాలసీ నిర్వహణ కోసం మేము యూజర్ ఆధారిత ఆన్‌లైన్ సాధనాలను రూపొందించాము. మేము డిజిటల్ పరివర్తనకు కట్టుబడిఉన్నాము. బీమాను సౌకర్యవంతమైన, సానుకూలమైన, నిరాటంకమైన ప్రక్రియగా మార్చడం ద్వారా మేము సేవలందించే కస్టమర్లకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో శ్రీ బ్రూస్ డి బ్రోయిజ్ తెలిపారు. ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్‌లో జనరాలీ పార్టిసిపేషన్స్ నెదర్లాండ్స్ ఎన్.వి. (జనరాలీ) మెజారిటీ వాటాదారుగా ఉండి, దన్నుగా నిలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో 46.98%గా ఉన్న వాటాలను 2023 మే నాటికి 73.99%కి పెంచుకుంది. భారతీయ ఉపఖండం పట్ల జనరాలీ నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. కీలక ఆసియా మార్కెట్లలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా జనరాలీ కృషి చేస్తోంది. పటిష్టమైన పెట్టుబడులు మరియు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో 6.8 కోట్ల పైచిలుకు కస్టమర్లను కలిగి ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న బీమా పరిశ్రమలో తమ విలువైన పాలసీదారులకు జనరాలీ తోడ్పాటుతో డిజిటల్ సొల్యూషన్స్ మరియు అసమానమైన కస్టమర్ సర్వీసుల ద్వారా వ్యక్తిగతీకరించిన అనుభూతులు, ఆకర్షణీయమైన ఉత్పత్తులు మరియు సమగ్రమైన తోడ్పాటు అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది.