మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపిలో శుక్రవారం 55వ రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (ఓపీ), జీఎం వెంటకటేశ్వరరావు, జెన్కో సీఈ ( బొగ్గు, వాణిజ్య) జీవన్ కుమార్ రక్షణ తనిఖీ బృందం సభ్యులు గణిని సందర్శించి రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు. మైన్ సేఫ్టీ పట్ల హర్షం వ్యక్తం చేశారు.ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు.కార్మికులకు రక్షణపై ఎప్పటికప్పుడు, అవగాహన కల్పిస్తే’ ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ లక్ష్యాలను సాధించాల్సి అవసరం ఉందన్నారు. ప్రమాద రహిత ఓపెన్కాస్ట్ మైన్ గా నిలిచేలా ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉన్నట్లుగా వివరించారు. ఎన్ఓపీ, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధనలను అనుసరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. 2023 వార్షిక సంవత్సరానికి సేఫ్టీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. వారి వెంటా జెన్కో జిఎం మోహన్ రావు, ఏఎమ్మార్ వైస్ ప్రేసిడెంట్ శ్రీదర్, సీనీయర్ జనరల్ మేనేజర్ కేఎస్ మూర్తి మెన్ మేనేజర్ శ్రీ నివాస్,సెప్ట్టి అధికారి సురేష్ బాబు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.