నవతెలంగాణ-బేగంపేట్
భారతీయ కార్పొరేట్ సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో కలిసి యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ”రన్ ఫర్ హెల్త్” పేరుతో మెగా 5కే రన్ ను నిర్వహించారు. ఆదివారం హైటెక్ సిటీ 5కే రన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన యశోద ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.యస్.రావు అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంట్, రాజన్నతో కలిసి 5కే రన్ ప్రారంభించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ‘హెల్తీ లైఫ్ స్టైల్’ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈరోజు 5000 మందికి పైగా ఉద్యోగు లు, వారి కుటుంబ సభ్యులతో పాటు యశోద ఆస్పత్రి యొక్క డాక్టర్ల బృందం, పారా మెడిక్స్, సిబ్బంది తదితరులు పాల్గొని విజ యవంతం చేసారు. ఈ అవగహన రన్ యశోద ఆస్పత్రి-హైటెక్ సిటీ నుండి ప్రారంబమై, టీఎస్‌సీ మీదుగా మల్లి యశోద ఆస్పత్రి-హైటెక్ సిటీ వర్ద విజయవంతంగా ముగి సింది.ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.యస్.రావు, మాట్లాడుతూ.. మన ఆరో గ్యంపై ప్రతి కూల ప్రభావం చూపే అనారోగ్యకరమైన జీవ నశైలిని దూరం చేయడమే ఈ పరుగు లక్ష్యం. ఈ సంవ త్సరం థీమ్ ”నా ఆరోగ్యం, నా హక్కు.” అనే నినా దంతో వ్యాయామాన్ని మన దినచర్యలో ఒక భాగం చేసు కోవా లని, రెగ్యులర్ వ్యాయా మం, నడక, మన శారీరక ఆరో గ్యాన్ని పెంచడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుందని, యశోద ఆస్పత్రిలో మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు, తెలిపారు.ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రెసి డెంట్ రాజ న్న మాట్లాడుతూ..తన సహచరులందరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, రోజువారీ నడకపై దష్టి పెట్టాలని, క్రమమైన వ్యాయామాన్ని కొనసాగించాలని బలమైన సందే శాన్ని అందించారు. సాఫ్ట్ వేర్ నిపుణులు నిశ్చల జీవనశై లిని విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పరుగు పెట్టాలని ఆయన కోరారు. యశోద గ్రూప్‌ఆఫ్ హాస్పి టల్స్, డైరెక్టర్, డాక్టర్.పవన్ గోరుకంటి మా ట్లాడుతూ.. వ్యాయామం, దాని పూర్తి ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అర్హత కలిగిన నిపుణుల పర్యవే క్షణలో మాత్రమే సరైన మార్గంలో చెయ్యాలి అని అన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, దయచేసి వ్యాయామాలు ప్రారం భించే ముందు ఫిజిషియన్ లేదా కార్డియాల జిస్ట్ సలహాతో మాత్రమే ప్రారంభించాలన్నారు. (అతను స్వయంగా ఒక ప్రొఫెషనల్ మారథాన్ రన్నర్). అనారోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడానికి ప్రతివారం 150 నుండి 300 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా 75 నుండి 150 నిమి షాల శక్తివంతమైన ఏరోబిక్ శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోవాలని స్వయంగా ఒక ప్రొఫెషనల్ మారథాన్ రన్నర్ డాక్టర్. పవన్ గోరుకంటి చెప్పారు.