ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కోసం 5 వ రోజు నిరసన దీక్ష

– ఎమ్మార్పీఎస్ కనక ప్రమోద్ మాదిగ
నవతెలంగాణ కంఠేశ్వర్
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం 5వ రోజు నిరసన దీక్ష ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ మేరకు మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్) అధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన 5 వ రోజు దీక్షను ఎమ్మెస్ ఎఫ్ నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి బైరపోగు శివ మాదిగ  ప్రారంభించారు.ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఈ నెల 18 నుండి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద స్పష్టమైన తేది ప్రకటించాలి. అలాగే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రైవేట్ బిల్లు పెట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి.తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న భారాస పార్టీ కూడా మాదిగల కోసం పార్లమెంట్ లో ఎంపీలు వర్గీకరణ కోసం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి అని డిమాండ్ చెయ్యడం జరిగింది.ఈ నిరసన దీక్షలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కంటేశ్వర్ బీరప్ప, విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు పెద్దోళ్ల యమున, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు రోడ్డ స్వప్న, అబ్బమ్మ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్ మాదిగ, మందర్ణ మారుతి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డ అశోక్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love