6 అడుగుల త్రాచు పాము పట్టివేత

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని నూతన వంతెన వద్ద గల ఓ ఇంట్లోకి 6 అడుగుల త్రాచు పాము రావడంతో కలకలం చెలరేగింది. గురువారం రాత్రి 9గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన త్రాచు పాము ను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అప్రమత్తమై విజయ పురిసౌత్ లోని నేచర్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ ప్రెసిడెంట్ బి. మహేష్ కి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Spread the love