దేశంలో కొత్తగా 6155 కరోనా కేసులు

నవతెలంగాణ – న్యూఢి

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. గతేడాది సెప్టెంబర్‌ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితు సంఖ్య 4,47,51,259కి చేరింది. ఇందులో 5,30,954 మంది మరణించారు. ప్రస్తుతం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మరణాలు నమోదయ్యాయి.మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.74 శాతం మంది కోలుకున్నారు. 1.19 శాతం మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కొత్తగా 6155 మందికి కరోనా…
 

 Spread the love