కుప్పకూలిన విమానం.. 62 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రెజిల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 62 మంది ప్రయాణికులతో వళుతున్న విమానం కుప్పకూలడంతో అందరూ చనిపోయారు. సావో పువాలోలోని నివాసప్రాంతమైన విన్‌హెడోలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం సావో పువాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై అధ్యక్షుడు లుయూజ్‌ లులా డసిల్వా విచారం ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. విమానం కుప్పకూలుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Spread the love