నవతెలంగాణ – హైదరాబాద్: కేరళలో 18 ఏండ్ల అథ్లెట్‌పై ఐదేళ్లుగా 62 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ‘13 ఏండ్ల ప్రాయంలోనే తనపై లైంగికదాడి జరిగిందని, పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి లైంగికదాడికి ఒడిగట్టాడని, ఆ తర్వాత పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు’ అని ఆమె తెలిపింది. పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి, 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.