భారీగా నగదు పట్టివేత

– భూపాలపల్లి ఫ్లయింగ్ స్క్వాడ్  కు అందజేత  
నవతెలంగాణ – శాయంపేట
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టగా రూ.6 లక్షల 40 వేల నగదును పట్టుకొని సీజ్ చేసి భూపాలపల్లి ఫ్లయింగ్ స్క్వాడ్  టీంకు అప్పగించినట్లు ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం… లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని కొత్తగట్టు సింగారం స్టేజి వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ములుగు జిల్లా కాట్రపల్లి కి చెందిన ఎటుకూరి వెంకన్న టీఎస్03 ఇవి 3336 వాహనంలో ఎటువంటి ఆధారాలు లేకుండా రూ.3 లక్షల 90 వేల నగదు తీసుకెళ్తుండగా తనిఖీలలో పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. చిట్యాల మండలం  జూకల్లుకు చెందిన తాట రాజబాబు ఏపీ 36 టిఏ 8846 వాహనంలో 2 లక్షల 50 వేల నగదు తీసుకెళ్తుండగా వాహన తనిఖీలలో పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ.6 లక్షల 40,000 నగదును పంచనామా చేసి భూపాలపల్లి ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకు అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు ఎటువంటి ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. ఎన్నికల నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఎస్ఐ ప్రమోద్ కుమార్ తెలిపారు.
Spread the love