అమెరికా రక్షణ కార్యదర్శి
న్యూయార్క్: రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు కొమ్ముకాస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలు ఇప్పటివరకు 65 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధా లను సరఫరా చేశాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ డెఫెన్స్ కాంటాక్ట్ గ్రూపు సమావేశంలో చెప్పారు. 31నాటో దేశాలు, కొన్ని అలీన దేశాల కలయిక తో ఏర్పడిన ఈ గ్రూపు 12వ సమా వేశంలో అమెరికా రక్షణ కార్యదర్శి ఈ అంశాన్ని వివరించారు. ఉక్రెయిన్ రష్యాతో చేయనున్న సుదీర్ఘ యుద్ధానికి కావలసిన ఆయుధాలను అందించటా నికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
ఉక్రెయిన్‌కు ఎఫ్-16రకం యుద్ధ విమానాలను కూడా సరఫరా చెయ్యటానికి, వాటిని నడపటానికి ఉక్రెయిన్ పైలట్లకు కావలసిన శిక్షణను ఇవ్వటానికి అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్ గతవారం ప్రకటిం చారు. యుద్ధ విమానాలనే కాకుండా వాయు రక్షణ వ్యవస్థలను, అందుకు కావలసిన ఆయుధాలను సరఫరా చేయటానికి కూడా అమెరికా వెనకా డదని అన్నారు.
ఉక్రెయిన్‌ను సమర్థి స్తున్న పశ్చిమ దేశాలు ఇలా ఆయుధా లను సరఫరా చేస్తూపోతే యుద్ధం మరింత కాలం కొనసాగుతుందనీ, అది ఉక్రెయిన్ సర్వనాశనం కావటా నికి మాత్రమే దారితీస్తుందని రష్యా పదేపదే హెచ్చరిస్తున్నది.