నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని ప్రాజెక్టు నగర్ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిప్యూటీ వార్డెన్ కల్తీ సాంబయ్య సోమవారం 600 రూపాయల విలువ చేసే ఆట వస్తువులను అందించారు. విద్యార్థులకు క్రీడల్లో ప్రావీణ్యం పొందేందుకు ఈ క్రీడా సామాగ్రి దోహదపడుతుందన్న ఆశాభావాన్ని సాంబయ్య వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీజీహెచ్ఎం ఫుల్సమ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు దారం యకమ్మ, చింత, లక్ష్మి,,రేగ, వెంకటలక్ష్మి పోలెబాయిన కవిత పోరిక జయరామ్ పొరిక రామ్ కుమార్ సిఆర్ టిఎస్ పల్సం, వేణు భూక్యా, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.