నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల కర్లపల్లిలో మంగళవారం యెస్.జి.ఎఫ్ క్రీడలు స్థానిక ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్ సభాఅధ్యక్షులు గా వ్యవహరించి ఘనంగా నిర్వహించారు ఈ క్రిడలు మండల క్రిడల ఇంచార్జ్ ఎంఈఓ.గొంది.దివాకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా స్థానిక ఎంపీపీ సూడి. శ్రీనివాస్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి విద్యతో పాటు క్రీడలలో రాణించాలని గెలుపు,ఓటములు సహజమని
నేటి ఓటమి రేపటి విజయానికి నాంది కావాలని తెలిపారు. ఈనెల ఏటూరునాగారంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడలంలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎన్నికై మన మండల, జిల్లా పేరు నిలబెట్టాలని తెలిపారు.మండలంలోని ప్రభుత్వ, కెజిబివి, జిల్లా పరిషత్, ఆశ్రమ, ప్రయివేట్ కు చెందిన విద్యార్థిని, విద్యార్థులు అండర్ 14,17 సంవత్సరాల బాల, బాలికలు సుమారు 350 మంది హాజరైనారు వీరికి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ బానోత్ బాలు వారికి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో కర్లపల్లి సర్పంచ్ లవుడ్య స్వాతి వాగ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయులు యాలం ఆదినారాయణ మెడిశెట్టి, సుధాకర్, జి. కనకయ్య,మేకల కృష్ణ, రాయబారపు. దీప్తి, నాగమణి, నరేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా బాద్యులు. చింత. కృష్ణ ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.