– స్కోడ ఇండియా వెల్లడి
ముంబయి : భారత్‌లో 24 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిసారిగా నిర్వహించిన 24 గంటల ఆన్‌లైన్ సేల్స్ ప్రోగ్రామ్‌లో 709 కార్ల బుకింగ్‌లను సాధించినట్లు స్కోడా ఆటో ఇండియా తెలిపింది. దేశంలో డిజిటలైజేషన్ వ్యూహాన్ని మరింతగా విస్తరించనున్నట్లు పేర్కొంది. ‘నేమ్ యువర్ స్కోడా’ క్యాంపెయిన్ లో భాగంగా డిజిటల్ క్యాంపెయిన్‌తో రాబోయే కాంపాక్ట్ ఎస్‌యువి కోసం ఇప్పటి వరకు 1.50 లక్షల పేరు సూచనలను పొందినట్లు తెలిపింది. తమ అన్ని షోరూంలను డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించింది.