నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 74.02 పోలింగ్ నమోదు: కలెక్టర్

– పోలింగ్  ప్రశాంతం
– సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ పార్లమెంటు స్థానానికి సోమవారం  నిర్వహించిన ఎన్నికలలో 74.02 శాతం  పోలింగ్ నమోదయినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి  వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె వెల్లడించారు.  ఈనెల 13 న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన లోకసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిందని , కొన్ని చోట్ల ఓటింగ్ సమయానికి ముందే వచ్చి   క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు టోకెన్లు అందజేసి పోలింగ్ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల  వారిగా పోలైన ఓట్ల వివరాలను ఆమె తెలియజేస్తూ.. 86 -దేవరకొండ అసెంబ్లీ  నియోజక వర్గ పరిధిలో 131838 పురుష ఓటర్లు,130624 మహిళా ఓటర్లు,18 మంది ఇతర ఓటర్లు , మొత్తం 262480 ఓటర్లు ఉండగా, సోమవారం నాటి పార్లమెంటు ఎన్నికలలో 94896 పురుష ఓటర్లు,  90405 మహిళ ఓటర్లు, ఇతరులు 9 మంది మొత్తం 185310 మంది ఓటర్లు  ఓటు వేశారని, ఈ అసెంబ్లీ  నియోజక వర్గ పరిధిలో 70.60 శాతం పోలింగ్  నమోదయ్యిందని వెల్లడించారు.87- నాగార్జునసాగర్ అసెంబ్లీ  నియోజక వర్గ పరిధిలో 115852  పురుష ఓటర్లు, 120611 మహిళా ఓటర్లు,21 ఇతర ఓటర్లు, మొత్తం 236484  ఓటర్లు ఉండగా, 87949 పురుష ఓటర్లు, 88231 మహిళా ఓటర్లు ,10  మంది ఇతర ఓటర్లు,మొత్తం 176190 ఓటర్లు ఓట్లు వేశారని, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల్లో 74.50 శాతం ఓట్లు పోలయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.88 -మిర్యాలగూడ అసెంబ్లీ  నియోజకవర్గ పరిధిలో 11 5773 పురుష ఓటర్లు, 120544 మహిళా ఓటర్లు,26 మంది ఇతర ఓటర్లు, మొత్తం 236343 ఓటర్లు ఉండగా, పార్లమెంటు ఎన్నికలలో 85811 పురుష ఓటర్లు, 87513 మహిళా ఓటర్లు,10 మంది ఇతర ఓటర్లు,  మొత్తం 173334 ఓటర్లు ఓటు వేశారని, మిర్యాలగూడ అసెంబ్లీ  నియోజక వర్గ పరిధిలో 73.34 పోలింగ్ శాతం నమోధైనట్లు వెల్లడించారు. 89- హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 121956 పురుష ఓటర్లు, 129471 మహిళ ఓటర్లు,17 మంది ఇతర ఓటర్లు, మొత్తం 251444 ఓటర్లు ఉండగా, పార్లమెంటు ఎన్నికలలో 94065 పురుష ఓటర్లు, 97871 మహిళా ఓటర్లు, 9 మంది ఇతర ఓటర్లు మొత్తం 191945 ఓటర్లు ఓటు వేశారని, ఈ నియోజకవర్గం పరిధిలో 76.34 పోలింగ్ శాతం నమోదయిందని అన్నారు.
90- కోదాడ అసెంబ్లీ  నియోజకవర్గ పరిధిలో 11 9172 పురుష ఓటర్లు, 125997 మహిళా ఓటర్లు , 18 మంది ఇతర ఓటర్లు, మొత్తం 245187 ఓటర్లు ఉండగా, పార్లమెంట్ ఎన్నికలలో 90604 పురుష ఓటర్లు, 93801 మహిళ ఓటర్లు, 10 మంది ఇతర ఓటర్లు, మొత్తం 184415 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఈ నియోజకవర్గ పరిధిలో 75.21 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. 91- సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  118949 పురుష ఓటర్లు, 125154 మహిళా ఓటర్లు,13 మంది ఇతర ఓటర్లు, మొత్తం 244116 ఓటర్లు ఉండగా, పార్లమెంటు ఎన్నికలలో 88069 పురుష ఓటర్లు, 90301 మహిళ ఓటర్లు, 8 మంది ఇతర ఓటర్లు కలుపుకొని మొత్తం 178378 మంది ఓటర్లు  ఓటు వేశారని, సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో 73.07 శాతం ఓట్లు పోలయ్యాయని ఆమె వెల్లడించారు. అదేవిధంగా 92- నల్గొండ అసెంబ్లీ  నియోజక వర్గ పరిధిలో  121303 పురుష ఓటర్లు, 128052 మహిళా ఓటర్లు, 56 ఇతర ఓటర్లు, మొత్తం 249411 మంది ఓటర్లు ఉండగా, పార్లమెంటు ఎన్నికల్లో  92203 పురుష ఓటర్లు , 95328 మహిళ ఓటర్లు, 34 ఇతర ఓటర్లు, మొత్తం 187565 ఓట్లు పోలయ్యాయిని, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో  74.02 ఓటింగ్ శాతం నమోదయినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రజలు, ఓటర్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అందరికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love