
మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాసరావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఇందిరా,స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ రాములు నాయక్,పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఆశ్రిత, లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు డాక్టర్ ఎస్ కె నాగుల్ మీరా ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆరాధ్య ఫౌండేషన్ మండల నాయకులు ఎర్రాజు కృష్ణ ,కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, నాగార్జున హై స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలు మారగాని విజయలక్ష్మి వెంకట్ గౌడ్, విజయ మేరీ హై స్కూల్లో తను ఉపాధ్యాయురాలు సిస్టర్ సబీనా, ఆయా గ్రామాలలోని ప్రాథమిక, ఉన్నత,జిల్లా పరిషత్ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ప్రత్యేకించి నాగార్జున, విజయ మేరీ ఉన్నత పాఠశాల లో విద్యార్థులు అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ త్యాగ వీరుల వేషాధారణలను ధరించి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు వేసిన వేషధారణలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడలను నిర్వహించగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి,జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి, గోరుగంటి ఉషా రామ్ కిషన్ రావు, గుర్రం సత్యనారాయణ బొల్లెపల్లి అశోక్,ఎంపీటీసీలు పన్నాల రమా మల్లారెడ్డి, గార్డుల రజితలింగరాజు ,సజ్జన్ నాయక్ ఏర్పుల నరేష్,ఆయా గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.