నవతెలంగాణ – జుక్కల్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీ జులై లో ఎబివిపి ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా మంగళవారం నాడు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అనంతరం స్థానిక బసవేశ్వర చౌక్ వద్ద ఏబీవీపీ పథకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి వాసరే సతీష్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జూలై తొమ్మిద వ తేదిన 1949 న స్థాపించి ఈరోజు దేశంలోనే కొన్ని వేల విద్యార్థి సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉంది జ్ఞానం, శీలం, ఏకత లు ప్రత్యేకతలుగా జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తూ విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు చేస్తుంది. అంతేకాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు అందించాలని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఏబీవీపీ పాత్ర కీలకం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు మహాపాదయాత్ర, రక్తదానం, విద్యార్థి రణభేరి, విద్యార్థి కధనభేరి వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలపై నీళ్లు నిధులు నియామకాలు కోసం అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించింది.ఏబీవీపీ ప్రారంభమైన నుంచి ఎంతోమంది కార్యకర్తలు చేసి నరహంతక రాక్షసులు నక్సలైట్లకు ఎదురుగా నిలిచి ప్రాణాలు వదిలారు వారికి మా జోహార్లు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గజానంద్, వీరేశం, మనోజ్, సాయి, అంజి, సాయిరాం ,మహేష్, కిరణ్, కృష్ణమోహన్, శైలేందర్, ప్రసాద్, దీపక్ వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు కళాశాల విద్యార్థుల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.