ఘనంగా ఎస్టీయూటీఎస్‌ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎస్టీయూటీఎస్‌ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిం చారు. రాష్ట్ర అధ్యక్షులు జి. సదా నందం గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.పర్వత్‌రెడ్డి యూనియన్‌ పతా కాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదానందంగౌడ్‌ మాట్లాడుతూ ఎస్టీయూ 76 సంవత్సరాలుగా ఉపా ధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నదని చెప్పారు. విద్యారంగంలో ఉపాధ్యా యుల సంక్షేమం, హక్కుల సాధనలో ముందున్నదని తెలిపారు. పర్వత్‌రెడ్డి మాట్లాడుతూ మఖ్దూం మొయినుద్దీన్‌ ఆశయాలను తమ సంఘం సాధించిం దని చెప్పారు.
ఎల్లప్పుడు ఉద్యమ బాటలో పయనించిందనీ, రాజీలేని పోరాటమే ఊపిరిగా నిలబడ్డదని తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేపట్టాలనీ, సీపీఎస్‌ ను రద్దు చేసి ఓపీఎస్‌ ను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈహెచ్‌ఎస్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Spread the love