– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా గాంధీ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు చేతులమీదుగా జెండా ఎగుర వేయడం జరిగింది.నెహ్రూపార్క్,రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించాలి.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తూ మనందరం స్వాతంత్య్ర ఫలితాలు అనుభవిస్తున్నాం అంటే అది ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం అని,దేశం ఇంతలా అభివృద్ధి చెందింది అంటే జవహర్ లాల్ నెహ్రూ నుండి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పనిచేసిన ప్రధాన మంత్రుల ఆలోచన విధానాల వల్లనే అని,దేశం సమైక్యంగా ఉండాలని ప్రజలందరు సమాన హక్కులు,జీవితం గడపాలని జవహర్లాల్ నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,మన్మోహన్ సింగ్,అబ్దుల్ కలామ్ ఆజాద్ లాంటి ప్రధానులు కోరుకున్నారని కానీ ప్రస్తుతం దేశంలో బిజెపి నాయకులు ప్రజలను మతాల పేరుతో రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నారని ఆయన అన్నారు.జిల్లా ప్రజలందరు,యువకులు కాంగ్రెస్ నాయకులు ఆ మహానుభావుల ఆశయాలను అందిపుచ్చుకుని దేశాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే అది ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం అని,ఈ సందర్భంగా ఆ మహనీయులను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతగానో వుంది అని వారికి నివాళులు అర్పించారు.నగర ప్రజలందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సినియర్ కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలం,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ఫ గంగారెడ్డి,మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్,సీనియర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు,సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,బొబ్బిలి రామకృష్ణ,కేశ మహేష్, ఈసా,జగడం సుమన్,మహిళా అధ్యక్షురాలు మటం రేవతి,పోల ఉష,చంద్రకళ,గాజుల సుజాత,శరత్ కుమార్,దత్తు,ప్రమోద్,గౌతం,కేశ రాజు తదితరులు పాల్గొన్నారు.