నవతెలంగాణ-మల్హర్‌రావు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడిచెర్ల, కొయ్యుర్ సెక్టార్ల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మండల కేంద్రమైన తాడిచెర్లలో తహ సీల్ధార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 7వ రోజు కొనసాగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మెలో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్ టీచర్‌కు రూ.10 లక్షలు, ఆయాకు రూ.5లక్షలు ఇ వ్వాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యు యేట్ వర్తింపజేయాలని, హెల్త్ కార్డు రూ.5లక్షలు ఇవ్వాలని, జీతంలో సగం పింఛన్ ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు, టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జయప్రద, అరుణ, రమాదేవి, పద్మ, అన్నపూర్ణ, వెంకట నర్సమ్మ పాల్గొన్నారు.
మోకాళ్ళ పై నిల్చొని నిరసన
ములుగు : అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేసి, వారి డిమాండ్లు పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ ములుగులో అంగన్ వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివరా 7వ రోజు కొనసాగింది. అంగన్‌వాడీలు మోకాళ్ళ పై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె సరోజన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ హక్కుల ను కాలరాసే విధంగా, ప్రభుత్వం,అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. పద్మ రాణి, మోక్ష రాణి, రేణుక,భాగ్య లక్ష్మి, విజయ, అనసూర్య, కల్పన, రాధిక, సన, మానస బాణమ్మ, స్వరూప, అలివేలు, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలి
తాడ్వాయి : అంగన్‌వాడీ టీచర్లను పర్మినెంట్ చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు కురెందుల సమ్మక్క డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11 నుండి ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక సమ్మె ఆదివారం 7వ రోజు కొనాసాగింది. మండలంలోని అంగన్‌వాడీ టీచర్లు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సమ్మక్క పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, తమ నాయకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.