80 క్వార్టర్స్ శాఖ 2 మహాసభ 

80 Quarters Branch 2 Mahasabhaనవతెలంగాణ – కంటేశ్వర్ 
80 క్వార్టర్స్ శాఖ రెండవ మహాసభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట శాఖ కార్యదర్శి రేఖ జండా ఆవిష్కరించారు. ఈ మహాసభకు సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు  మాట్లాడుతూ.. ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు అందాల్సిన పథకాలు అందకుండా చేసుకోవడానికి, పని తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేక నిరుపేదలు నిరుపేదలు గానే మిగులుతున్నారని ఉన్నోడు ఇంకా ఉన్నోడిగా పెరుగుతున్నారని అన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయడంతో పాటు నిరుపేదలకు ఉపయోగపడే పథకాలు ప్రైవేటీకరణ చేయడంతో పేదలు అనేక ఇబ్బందులకు పడుతున్నారని తెలిపారు. రామున్ని రాజకీయంలోకి లాగి ప్రజాసమస్యలను మరుగునపరుస్తున్నారన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల్ని పట్టించుకొని ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చేసుకోవడానికి చేతినిండా పని ఉండే విధంగా పథకాలను అమలు జరిపి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు.  అలాగే సభను ఉద్దేశించి జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత మాట్లాడుతూ.. ఈ శాఖ పరిధిలో సిసి రోడ్లు వీధిలైట్లు మురికి కాలువలు మంచినీటి కలెక్షన్లు  ఈశ్రం కార్డులో పింఛన్లు జీవన జీవో నెంబర్ 58 కింద ఇంటిలోని కోసం ఆన్లైన్లో  ఇలా స్థానికంగా ఉన్న సమస్యలపై సీపీఐ(ఎం) పార్టీ దృష్టికి వచ్చిన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేసి సాధించుకున్న విజయాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు రానున్న రోజుల్లో నిరుపేదలకు అందవలసిన పథకాలు అందకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు రేఖా,  సునీత, జ్యోతి, ఫిరంగి బాయి, ,s జ్యోతి,  సత్యశీల, సోనీ, శాలు బాయ్   తదితరులు పాల్గొన్నారు.
Spread the love