రూ.800 కోట్ల రుణాల జారీ లక్ష్యం

 కినారా క్యాపిటల్‌ సిఒఒ వెల్లడి
హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లోని ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలకు మరింత మద్దతును అందించనున్నట్లు కినారా క్యాపిటల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సిఒఒ) తిరునావుక్కరసు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎపి, టిఎస్‌లో రూ.800 కోట్ల పైగా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. 2016లో తమ సంస్థ ఫిన్‌టెక్‌సేవలను ప్రాంభించిగా ఇప్పటి వరకు 20,000 మంది వ్యాపారులకు అప్పులిచ్చిందన్నారు. 2021-22, 2022- 23లో తమ సంస్థ ఆస్తుల్లో 190 శాతం పెరుగుదల చోటు చేసుకుంద న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. పలు రంగాలలో 300 కంటే ఎక్కువ ఉప రంగాలకు వ్యాపార రుణాలను అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 27 శాఖలతో 300 మంది ఉద్యోగులను కలిగి ఉన్నామన్నారు. 2023-24లో కొత్తగా 150 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నామన్నారు.

Spread the love