హ‌వాయిలో కార్చిచ్చు పెను విషాదాం.. 800మంది మిస్సింగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా ద్వీప‌మైన హ‌వాయిలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగిల్చిన విష‌యం తెలిసిందే. ఆ భారీ దావాన‌లం ధాటికి ఆ ద్వీపంలోని ల‌హైనా ప‌ట్ట‌ణంలో అనూహ్య‌మైన విధ్వంసం చోటుచేసుకున్న‌ది. రాత్రికి రాత్రే వ‌చ్చిన ఆ కార్చిచ్చులో వంద‌ల సంఖ్య‌లో ఇండ్లు కాలిపోయాయి. అనేక బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ ప్ర‌మాదంలో సుమారు 800 మంది మిస్సింగ్ అయిన‌ట్లు కూడా తెలుస్తోంది. ఆ అగ్నికీల‌ల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో చాలా మంది స‌ముద్రంలో దూకారు. కొంద‌రు కార్ల‌లోనే కాలిపోయారు. కొంద‌రు ఆచూకీ లేకుండాపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా 800 మంది లెక్క దొర‌క‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు.

Spread the love