అక్రమంగా నిల్వ ఉంచిన 85 గ్యాస్ సిలిండర్లు సీజ్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసరా గ్రామంలో రెడ్డి పురుషోత్తం రెడ్డి వద్ద నుండి శనివారం అక్రమంగా నిల్వ ఉంచిన 85 గ్యాస్ సిలిండర్ లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై ములుగు డిప్యూటీ తాహసిల్దార్ ఎం నితీష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు ఉదయం.8.30 గంటలకు విజిలెన్స్ అధికారులు పసర గ్రామానికి చెందిన శ్రీ రెడ్డి పురుషోత్తం రెడ్డి  తన రెడ్డి కాంప్లెక్స్ నందు గల రూంలో  అక్రమంగా నిల్వచేసిన (85) గ్యాస్ సిలిండర్లు పట్టుకొని ఇద్దరు సివిల్ సప్లయి అధికారుల సమక్షంలో సీజ్ చేసి క్రిమినల్ కేసు కూడా పెట్టనైనదన్నారు. ఈ దాడులలో కె రామచందర్ డిటిసిఎస్ ఎటునాగారం, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ తోపాటు స్థానిక ఆర్ఐ రాజేందర్ లు పాల్గొన్నారు.
Spread the love