ప్రజావాణికి 8,603 దరఖాస్తులు.. ఇండ్లకోసమే 8,100

ఇండ్లకోసమే– దరఖాస్తులను స్వీకరించిన ప్రజావాణి
– ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 8, 603 దరఖాస్తులు అందాయి. అందులో సింహభాగంగా 8,100 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసమే వచ్చాయి.రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, స్టేట్‌ నోడల్‌ అధికారి అధికారి దివ్య దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు 252, విద్యుత్‌ శాఖకు 110, రెవెన్యూ శాఖకు 51, ప్రవాసీ ప్రజావాణికి 5, ఇతర శాఖలకు 85 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.

Spread the love