నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోస్టల్ శాఖ ద్వారా రాష్ట్రంలో 8,694 మంది భక్తులకు ప్రసాదాలు అందించినట్టు ఆ శాఖ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ మహంతి సంతోష్‌కుమార్ నరహరి తెలిపారు. అంతరాలయ అర్చన పేరుతో వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు చేయించి, పోస్టు ద్వారానే ప్రసాదాలు అందచేశామన్నారు. భద్రాచలం నుంచి 2,773 మంది, యాదాద్రి నుంచి 5,051 మంది, ధర్మపురి దేవస్థానం నుంచి 870 మంది ఈ సేవల్ని వినియోగించుకున్నట్టు పేర్కొన్నారు. పసుపు, కుంకుమ, మిస్రీ, డ్రై ఫ్రూట్స్, పాకెట్ సైజ్ లామినేటెడ్ ఫోటోలు స్పీడ్ పోస్టు ద్వారా వారికి అందచేశామన్నారు. 6,208 పోస్టాఫీసుల్లో ఈ సేవలు బుక్ చేసుకొనురనీ, ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్ ద్వారా భక్తులకు వీటిని అందచేశామని వివరించారు. అన్ని శుభదినాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.