ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం..

నవతెలంగాణ-హైదరాబాద్‌: సాగర్‌ రింగ్‌రోడ్డు కూడలిలో చేపట్టిన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌ పిల్లర్ల మధ్య ఇనుప్‌ ర్యాంప్‌ ఏర్పాటు చేస్తుండగా అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love